ప్రజా దర్బార్ కు ప్రజా సమస్యలపై మహా స్పందన
సత్వర పరిష్కారం కోసం అధికారులకు చీప్ విప్ జీవి ఆదేశాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో జరిగే ప్రజాధర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నది. శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని, ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు తమ దరఖాస్తులు, తెల్ల కాగితాల మీద కాకుండా ఎంతో జవాబుదారీతనంగా ఉండేటట్లు చీప్ విప్ ఫోటోతో ముద్రించిన లెటర్ ప్యాడ్ దరఖాస్తు దానిపై సమస్యలపై వచ్చిన వారి వివరాలు మండలం గ్రీవెన్స్ నెంబరు ఏ శాఖకు పంపాలి. సమస్యలపై వచ్చిన ప్రజలు ఆ దరఖాస్తు కార్యాలయ సిబ్బందిచే పూర్తి చేయించి, ప్రజలు ఆ ఫారంతో ప్రజా దర్బార్ లో చీఫ్ విప్ జీవికి అందజేస్తున్నారు. ఆయన వెంటనే పూర్తి స్థాయిలో సమస్య తెలుసుకొని అక్కడ నుండే ఫోన్ ద్వారా వివిధ శాఖ అధికారులకు చెప్పటం, తక్షణం ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశించడంతో ప్రజాదర్బార్లో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శుక్రవారం ప్రజా దర్బార్ లో స్థానిక మిద్దేభావి సమీపంలో ఉంటున్న పేదలు తమకు విద్యుత్ మీటర్లు లేవని వారు తెలిపారు. పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు లేవని వెంటనే సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే స్థానిక అర్బన్ హౌసింగ్ కు తన మూడున్నర ఎకరాలు భూమి ఇచ్చిన జైనాబికి ఆ భూమి బదులుగా వ్యవసాయ భూమి ఇవ్వాలని అడగడం జరిగింది. అధికారులు తనకు వ్యవసాయ భూమి ఇవ్వలేదని దరఖాస్తు ద్వారా జీవికి తెలపడంతో ఆయన స్థానిక తాసిల్దార్ కు ఫోన్ చేశారు.. తక్షణం ఆ మహిళకు వ్యవసాయ భూమి సేకరించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పట్టణంలో గ్రీనరీ పార్కు ఏర్పాటు చేసేందుకు 15 ఎకరాల స్థలం సేకరించాలని, భూమి గుర్తించాలని తాసిల్దార్ కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే శిథిలావస్థలో ఉన్న స్థానిక గ్రంథాలయం మార్చేందుకు మరో భవనం అద్దెకు ఇప్పించాలని గ్రంథాలయ సిబ్బంది చీఫ్ విప్ కు వివరించారు. అలాగే గ్రంథాలయానికి కూడా నూతన భవన నిర్మాణానికి స్థానిక ఎన్ఎస్పి కాలనీలో 15 సెంట్లు కేటాయించాలని అందుకు ప్రభుత్వ అనుమతులు తెప్పించాలని తాసిల్దార్ కు జీవి సూచించారు. అలాగే శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామం వేల్పూరు పంచాయతీలో కలిసి ఉన్నదని, తమ గ్రామం లో 2000 జనాభా కలిగి, 1500 మందికి పైగా ఓటర్లు ఉన్నారని, తమ గ్రామాన్ని విడగొట్టి ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటు చేయించాలని గంటవారిపాలెం గ్రామస్తులు జీవికి దరఖాస్తు అందజేశారు. ఇలా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను చీప్ విప్ కార్యాలయం నుండి ఆయా ప్రభుత్వ శాఖలకు ఆన్లైన్ ద్వారా పంపుతూ, ఆ సమస్యలు పరిష్కరించే దిశగా చీప్ విప్ జీవి ఆరా తీస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా, టిడిపి పట్టణ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, టిడిపి నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రజా దర్బార్ కు ప్రజా సమస్యలపై మహా స్పందన )
