Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వచ్చే మూడేళ్లలో ప్రతిగ్రామానికి తారు రోడ్ల నిర్మాణం

వచ్చే మూడేళ్లలో ప్రతిగ్రామానికి తారు రోడ్ల నిర్మాణం

వచ్చే మూడేళ్లలో ప్రతిగ్రామానికి తారు రోడ్ల నిర్మాణం

పల్లె ఆర్థిక ప్రగతిలో కీలకంగా రహదారుల అనుసంధానం

2024 నాటికి రూ.55లక్షల తలసరి ఆదాయమే లక్ష్యం

వైకాపా ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యం

*హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలనలో చీఫ్‌ విప్ జీవి..

న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో వచ్చే అయిదేళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రభుత్వ చీఫ్‌ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి అంజనేయులు అన్నారు. అలానే ప్రతిఊరి లో సీసీ రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణం పూర్తి చేస్తామని, విజన్ 2047లో భాగంగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.55లక్షలకు, జీఎస్డీపీ వృద్ధిని 17.11శాతానికి పెంచడంలో అది ఎంతో కీలకమన్నారు. వినుకొండ నియోజకవర్గంలో అందుగుల కొత్తపాలెం వద్ద రూ.15.83 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీవి మీడియాతో మాట్లాడుతూ. గ్రామాల ఆర్థిక స్థితిగతులు పెంచాలంటే రోడ్లు, బ్రిడ్జిలు చాలా అవసరం అన్నారు. అవి వస్తే పండిన పంటలు మార్కెట్కు తీసుకుని వెళ్లి, గిట్టుబాటు ధరలు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుందని, ప్రయాణ దూరాలు కూడా తగ్గుతాయన్నారు. అందుగుల కొత్తపాలెం, పాత నాగిరెడ్డిపల్లె మధ్య ఉన్న బ్రిడ్జితో పాటు పువ్వాడ వద్ద నిర్మిస్తున్న మరో బ్రిడ్జితో ప్రకాశం, పల్నాడు జిల్లా అనుసంధానం పెరుగుతుందన్నారు. అరాచకం, దోపిడీ తప్ప అభివృద్ధి పట్టని గత ప్రభుత్వంలో అడుగుకో గుంత, గజానికో గొయ్యి ఉండేదని, కూటమి ప్రభుత్వంలో ఆ దుస్థితి మార్చతున్నామన్నారు. ఇప్పటికే 20వేల కి.మీ. గుంతలు పూడ్చి రోడ్లు బాగు చేశామని, గ్రామాలకు కొత్తరోడ్లు కూడా వేస్తున్నామన్నారు. పల్లెపండుగ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.4,500కోట్ల తో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. అదికాక రూ. 2,123కోట్లతో 12999గ్రామాలను కలపడానికి 4,700 కిమీ పొడవైన రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సాస్కీ పథకం ద్వారా తొలిసారి నిధులు తీసుకుని వస్తున్నట్లు వెల్లడించారు. జగన్ చేసిన రూ.10లక్షల కోట్ల అప్పుల్లోనూ చంద్రబాబు సూపర్‌ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ చేశారని, ఇలాంటి ప్రభుత్వం మరో 20-25 ఏళ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ తరహాలో అభివృద్ధిలో దూసుకు వెళ్తుందన్నారు. జగన్ రద్దు చేసిన 93 కేంద్ర పథకాలు పునరుద్ధరించి ప్రజలకు ఆ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. 18నెలల కూటమి పాలనలో 8న్నర లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్‌ జరిగి 7లక్షల 62వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మొత్తం 13న్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని, ఈ అభివృద్ధి యజ్ఞంలో కక్షపూరిత రాజకీయాలకు తావు లేదన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి కల్పనే లక్ష్యంగా దేశవిదేశాల్లో బ్రాండ్ ఏపీని చంద్రబాబు బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నారని ప్రజలు కూడా ఇదే అభివృద్ధిని, సుస్థిర పాలనను కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ , నాయకులు, అధికారులు పాల్గొన్నారు.(Story :వచ్చే మూడేళ్లలో ప్రతిగ్రామానికి తారు రోడ్ల నిర్మాణం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!