శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలి
వినుకొండలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్ మాట వినిపించకూడదు
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలి
పోలీసులతో సమీక్షలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం
న్యూస్ తెలుగు/వినుకొండ : నియోజకవర్గంలో ప్రతిచోట శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఎక్కడా అసాంఘిక శక్తుల్ని ఉపేక్షించవద్దని, గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నేరప్రవృత్తి గలవారి కదలికలు ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాన్నారు. ఈ సందర్బంగా మంగళవారం వినుకొండ పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్ల సీఐలు ప్రభాకర్, బ్రహ్మయ్యతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరీ ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో వచ్చే ఫిర్యాదులను అత్యంత అప్రమత్తత, వేగం గా స్పందించాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండాలని, అవసరమై తే సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు, వాగ్వాదాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్షన్ గొడవలు ఉన్న చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చట్టాలు, యువత లో మాదక ద్రవ్యాల ప్రమాదాలు, సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.(Story :శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలి )

