చీప్ విప్ జీవి చొరవతో రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణానికి 4 కోట్లు విధులు మంజూరు.
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రత్యేక సిఫార్సుతో వినుకొండ కొండపై వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్లు సిజిఎఫ్ నిధులు కేటాయిస్తూ సోమవారం రాత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దేవాలయ నిర్మాణానికి 2 కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయించగా, ఆలయ నిర్మాణానికి ఖర్చు అంచనా పెరగడంతో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గుడి నిర్మాణానికి పెరిగిన అంచనాలను ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆలయ నిర్మాణం ధ్యేయంగా పనిచేస్తున్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆలయ నిర్మాణ అంచనా ఖర్చు పెంపు అంశాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబుస్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఆదేశాలతో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి 4 కోట్లు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయటం, దేవాలయ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న జీవి ఆంజనేయులు చూపుతున్న ప్రత్యేక చొరవ పట్ల వినుకొండ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.(Story :చీప్ విప్ జీవి చొరవతో రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణానికి 4 కోట్లు విధులు మంజూరు. )

