గిరిజన శాఖ మంత్రి డ్రైవర్ పై వైయస్సార్ పార్టీ ఫిర్యాదు
న్యూస్ తెలుగు /సాలూరు : ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి కారు డ్రైవర్ రౌతు హరి కుమార్ పై మాజీ గిరిజన శాఖ మాత్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పిఏ అధికారుల నాగరాజు బుధవారం సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు వైయస్సార్ పార్టీ ఇతర నాయకులతో కలిపి పోలీస్ స్టేషన్ లో పట్టణ సీఐ బి అప్పలనాయుడుకు ఫిర్యాదు అందజేశారు. మూడు రోజుల క్రితం మంత్రి సంధ్యారాణి డ్రైవర్ రౌతు హరికుమార్ తనపై అసభ్యకరమైన పదజాలంతో వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టారని తెలిపారు. దీనితో తాను మానసికంగా చాలా కృంగిపోయినని నాగరాజు ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి మంత్రి డ్రైవర్ హరికుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.(Story:గిరిజన శాఖ మంత్రి డ్రైవర్ పై వైయస్సార్ పార్టీ ఫిర్యాదు)

