నూతనంగా డయాలసిస్ సెంటర్ ప్రారంభం
న్యూస్ తెలుగు / వినుకొండ : ఇటీవల వినుకొండ కారంపూడి రోడ్డులో ప్రారంభమైన సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలకు వచ్చిన చీఫ్ విప్ జీవి ను డాక్టర్ అన్న మణికంఠ సురేష్, డాక్టర్ మధుల దంపతులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం వైద్యశాలలో ఏర్పాటుచేసిన ఐ సి యు యూనిట్స్ తో పాటు డయాలసిస్ సెంటర్ అదేవిధంగా ల్యాబ్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. ఈ స్థాయిలో వినుకొండ నియోజకవర్గ ప్రజలకు వైద్యశాలలో అందించాలని సంకల్పంతో మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేయడంపై వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండలో మొట్టమొదటిసారిగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా అత్యాధునికైనా వైద్యం ఇక్కడే అందించడం హర్షనీయమన్నారు. జనరల్ సర్జరీ, లాప్రోస్కోపీ, లేజర్ అత్యాధునిక పరికరాలతోటి పెద్దపెద్ద సిటీలో అందించే వైద్య సేవలు డాక్టర్ మణికంఠ సురేష్ అందిస్తున్నారని వెల్లడించిన ఆయన ఇక డాక్టర్ మృదుల తేజస్వి సంతాన సాఫల్యం కొరకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారని, ఈ సేవలను నియోజకవర్గ ప్రజలతో పాటు పలనాడు మరియు ప్రకాశం జిల్లాల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. (Story:నూతనంగా డయాలసిస్ సెంటర్ ప్రారంభం)

