సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు
జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆత్మకూరు శంకుస్థాపనల పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, పూర్తి శాంతియుత వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది.
జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో సమగ్ర బందోబస్తు ఏర్పాట్లు చేసి, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేశారని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సోమవారం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, కానిస్టేబుల్ స్థాయి వరకు అందరూ చూపిన కర్తవ్యనిబద్ధత ప్రశంసనీయమైనది. విభాగాల మధ్య అద్భుత సమన్వయం, సమయపాలన, శ్రద్ధతో వ్యవహరించడం వలన పర్యటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసింది. తమ విధుల్లో అంకితభావంతో విధులు నిర్వహించిన ప్రతి పోలీసు సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. (Story:సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు )

