Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ట్రై సైకిళ్ల పంపిణీ

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ట్రై సైకిళ్ల పంపిణీ

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ట్రై సైకిళ్ల పంపిణీ

న్యూస్ తెలుగు / వినుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు 15 ఏళ్ల బంగారు పాలన, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్వగృహం ఎదుట ఆవరణలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభకు టిడిపి పట్టణ అధ్యక్షులు బొంకూరి రోశయ్య అధ్యక్షత వహించారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. వినుకొండ ప్రాంతంలో ఫ్లోరిన్ పీడిత కారణంగా అధికంగా దివ్యాంగులు ఉన్నారని, ఫ్లోరిన్ నివారించి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాను జన్మభూమి స్ఫూర్తితో 1998లో చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ద్వారా గత 30 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నామన్నారు. చంద్రబాబు 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎంతో హుందాగా వ్యవహరిస్తూ, ప్రజల కోసం కష్టపడ్డారన్నారు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం క్రూరంగా నానా హింసలు పెట్టినప్పటికీ, మనోధైర్యం ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. అలాగే తన సతీమణి శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతిని ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గంలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ను ఆదుకుంటూ వారి పిల్లలకు స్కాలర్షిప్స్ అందజేస్తాం అని, దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అలాగే ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు స్కాలర్షిప్తులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు అభివృద్ధి ఆయన సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. బాబు హయాంలో హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో, అదే రీతిలో ఏపీ కూడా అభివృద్ధి చెందబోతుందన్నారు. తాను జిల్లా, వినుకొండ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ వినుకొండను టాప్ 10 లో ఉంచుతానన్నారు. గత వైసిపి అరాచక పాలనలో సాగునీటి ప్రాజెక్టులన్ని కుంటుపడ్డాయని, నేడు కూటమి ప్రభుత్వం అన్ని నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని, ఇందుకు ప్రజలు పూర్తి సహకారం అందిస్తున్నారు అన్నారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ. ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్న జీవి ఆంజనేయులు సేవలను కొనియాడారు. చంద్రబాబు దివ్యాంగుల కోసమే విశ్వ మానవ సేవ లలో ముందుంటే, జీవి కూడా అదే బాటలో ముందుకు సాగుతున్నారు అన్నారు. వినుకొండలో త్వరలో భూమి సేకరించి గ్రంధాలయ భవనం నిర్మించి పాటకులకు అందుబాటులోకి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6,000, మంచం లో నుండి లేవలేని వారికి 15,000. ఇస్తున్నదని, అయితే ఆనాడు వైసిపి ప్రభుత్వం వాలంటీర్లను తొలగిస్తే పెన్షన్లు ఇవ్వరు అన్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారన్నారు. జిడిసిసి బ్యాంకు జిల్లా చైర్మన్ మక్కెన మల్లి కార్జునరావు మాట్లాడుతూ. శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ గత 30 ఏళ్లుగా రాజకీయాలు, కుల మతాలకతీతంగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ నియోజక వర్గంలో మంచి గుర్తింపు పొందుతున్న కారణంగా, మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ స్థాయికి ఎదిగి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నరన్నారు. అతి త్వరలో పట్టణంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు 40 ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, కె.నాగ శ్రీను, గంగాధర్, బ్రహ్మయ్య, జానీ, హనుమా నాయక్, వెంకటరెడ్డి, అయినాల కోటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వర్లు, షమీం ఖాన్, గడిపూడి విశ్వనాథం, యార్లగడ్డ లెనిన్ కుమార్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెమ్మాసాని నాగేశ్వరరావు, రైల్వే బోర్డు సభ్యులు రాధ, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు. (Story:దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!