డ్రగ్స్ వద్దు చదివే ముద్దు
న్యూస్ తెలుగు/సాలూరు : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు పట్టణంలో అభ్యుదయం సైకిల్ యాత్రను ఆమె ప్రారంభించారు. ర్యాలీ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. సాలూరు RTC కాంప్లెక్స్ నుండి ప్రారంభమై డీలక్స్ సెంటర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఅమ్మకి చెప్పి ఏపనైనా చేయండి ” అంటూ అమ్మ ప్రేమ గురించి హృదయపూర్వకంగా వివరించారు ప్రజల్లో ఆరోగ్య చైతన్యం, పర్యావరణ, రవాణా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టి, కాఫీ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపుపై దృష్టి సారించాలన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సాగే ఈ సైకిల్ యాత్ర విజయవంతం చేయాలని అన్నారు. డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్న పోలీస్ అధికారులకు ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సాలూరు మరియు పరిసర ప్రాంత పాఠశాలల విద్యార్థులు పట్టణ ప్రజలు డీఎస్పీ రాంబాబు, సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్సై, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్ మక్కువ ఎస్ఐ వెంకటరమణ, మొబైల్ లీగల్ టీం పోలీసులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. (Story:డ్రగ్స్ వద్దు చదివే ముద్దు)

