Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అవగాహనతోనే ఎయిడ్స్ ని అంతం చేయవచ్చు

అవగాహనతోనే ఎయిడ్స్ ని అంతం చేయవచ్చు

అవగాహనతోనే ఎయిడ్స్ ని అంతం చేయవచ్చు

న్యూస్ తెలుగు/సాలూరు : అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయవచ్చని సాలూరు పురపాలక సంఘం కమిషనర్
టిటి రత్నకుమార్ తెలిపారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా
ఆయన ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయంలో
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నిర్వహించబడుతుందని తెలిపారు.
ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం హెచ్‌ఐవి (హెచ్ఐవి) వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, ఉపయోగపడుతుందన్నారు. హెచ్‌.ఐ.వి కి వ్యతిరేకంగా పోరాటంలో మరణించిన వారిని స్మరించుకోవడానికి మరియు హెచ్‌.ఐ.వి నివారణ, చికిత్స, సంరక్షణ మరియు మద్దతు యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఉద్దేశించబడిందని అన్నారు.
సాధారణంగా, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క లక్ష్యాలు
అవగాహన కల్పించడం హెచ్‌.ఐ.వి ఎలా వ్యాపిస్తుంది, దానిని ఎలా నివారించాలి మరియు చికిత్సా ఏమిటి అనే దాని పై ప్రజలకు సరైన సమాచారం అందించడం జరుగుతుందన్నారు. ఈ
కళంకాన్ని తగ్గించడం హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష మరియు కళంకాన్ని నిర్మూలించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు అలవాటపడకుండా స్వచ్ఛంగా ఉంటూ కుటుంబ సభ్యులతో జీవించాలని తెలియపరచడమైనదని తెలిపారు
ఈ కార్యక్రమంలో మేనేజర్ శివప్రసాద్ , మున్సిపల్ డిఈ ప్రసాద్ రావు శానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ ఆర్ ఐ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. (Story:అవగాహనతోనే ఎయిడ్స్ ని అంతం చేయవచ్చు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!