3 లక్షల మంది అర్హులైన వారికి పింఛన్లు ఎగ్గొట్టిన చరిత్ర జగన్‌ది
దేశంలోనే నంబర్-1గా సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఏపీ
వినుకొండ పట్టణం, ప్రతి పల్లెకు కుళాయి ద్వారా రక్షిత మంచినీరు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 18నెలల కాలంలో పింఛన్ల పంపిణీలో రికార్డులు సృష్టించింది, దేశంలోనే సంక్షేమ పథకాల అమల్లో ఏపీని నెంబర్-1 స్థానంలో నిలిపిందని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అయిదేళ్ల పాలనలో 3లక్షల మంది అర్హులైన వారికి పింఛన్లు ఎగ్గొట్టడం జగన్ చరిత్ర అయితే, 63.25లక్షలమంది పింఛన్లు ఇస్తూ కూడా అర్హులైన ప్రతిఒక్కరికి న్యాయం చేయాలన్నది చంద్రబాబు సంకల్పం అన్నారు. వినుకొండ నియోజక వర్గంలో బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛను సొమ్ము మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ “ప్రజలకు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. 1వ తేదీన ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య 90శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు.
మరో 3 నెలల్లో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు
ఈ సందర్భంగా మరో 3 నెలల్లో ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వబోతుందని, అందుకు ముందు గా రేషన్ కార్డులు జారీ చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఏటా రూ.33వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నామని, గడిచిన 18నెలల్లో 50వేల 763కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం వెచ్చించామన్నారు. గతంలో ఒక్క నెల లేకున్నా పింఛన్ ఇచ్చే వారు కాదని, ఇ ప్పుడు 3నెలలకోసారి తీసుకుని వెసులుబాటు కల్పించామన్నారు.
రూ.210 కోట్లతో వినుకొండ శాశ్వత మంచినీటి పథకం
2019లో వినుకొండకు తీసుకుని వచ్చిన మంచినీటి పథకాన్ని పూర్తి చేయకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని వాపోయిన చీఫ్‌విప్ జీవి ఫలితంగానే నాడు తెచ్చిన 161 కోట్ల కేటాయింపు లు మురిగిపోయాయన్నారు. మళ్లీ చంద్రబాబు, మంత్రి నారాయణ సహకారంతో రూ.210 కోట్లు నిధులు తెచ్చామని త్వరలో వినుకొండ పట్టణం దాహార్తి తీర్చుతామన్నారు. వినుకొండ శాశ్వత మంచినీటి పథకం, గ్రామీణ మంచినీటి పథకం అన్నీ పూర్తి చేసి ప్రతి ఇంటికి రక్షిత మం చి నీరు అందిస్తామన్నారు.
విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీటర్ పోస్ట్‌ల భర్తీ, ప్రతిఊరిలో విలేజ్ క్లీనిక్ ఏర్పాటు విద్యవైద్యంపై తమ ప్రాధాన్యతకు నిదర్శనంగా పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ బడుల్లో కావాల్సినంత మంది టీచర్లను పెట్టిన కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దు తున్న మంత్రి లోకేష్ కృషిని అభినందిస్తున్నారని అన్నారు. స్థానికంగా రూ36 లక్షలతో హెల్త్ క్లీనిక్ కూడా ప్రారంభించడం కూడా సంతోషంగా ఉందన్నారు. వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్పత్రుల్ల జ్వరం బిళ్లలు దొరకని దుస్థితి నుంచి ఇప్పుడు అన్నీ మార్చుతున్నట్లు తెలిపారు.
గుంతలు పూడ్చని దుస్థితి నుంచి కొత్తరోడ్లు
గత ప్రభుత్వంలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి కూడా నిధులు ఇవ్వలేదని, కూటమిప్రభుత్వం రాగానే 20వేల కి.మీ. రోడ్లు బాగు చేయడం తమ పనితీరుకి నిదర్శనంగా చెప్పారు చీఫ్‌విప్ జీవి. తాము 18ఏళ్ల క్రిత కలవల చెరువు రోడ్ వేస్తే వైకాపా అయిదేళ్లలో గుంతలు కూడా పట్టించు కోలేదని, ఇప్పుడు మళ్లీ తామే కొత్త రోడ్ వేస్తున్నామన్నారు. గాంధీనగర్ సంఘం నుంచి పలుకూరు వరకు 4.5 కోట్లతో రోడ్ వేసేందుకు నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించా మన్నారు. బొల్లాపల్లి మండలం కారంపూడి, దుర్గి ఆర్&బీ రోడ్ కోసం కూడా రూ.5కోట్ల నిధులు తీసుకొచ్చామని, ఇలా ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ తప్పక ప్రభుత్వం తరఫున రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.
అవగాహనతోనే ఎయిడ్స్‌పై పోరాటం
పింఛన్ల పంపిణీ అనంతరం ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కూడా మాట్లాడిన చీఫ్‌విప్ జీవి ఈ విషయంలో అవగాహనతో అంతా పోరాటం చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తరఫున హెచ్‌ఐవీ నిర్థరణ పరీక్షలు, ఏఆర్టీ మందులు ఉచితంగానే అందిస్తున్నామని, వాటితో పాటు పౌష్టి కాహారం ద్వారా బాధితులు దీర్ఘకాలం బతికే అవకాశం ఉందన్నారు. యువత ఆ బారిన పడకుం డా ఆరోగ్యాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story: 3 లక్షల మంది అర్హులైన వారికి పింఛన్లు ఎగ్గొట్టిన చరిత్ర జగన్‌ది )

