Homeవార్తలుతెలంగాణజిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజా వాతావరణం ప్రశాంతంగా కొనసాగడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వనపర్తి జిల్లా పరిధిలో ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం కఠినంగా నిషేధం. ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటిలేదు” అని స్పష్టం చేశారు. 30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయి. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయి… అందరూ తప్పనిసరిగా పాటించాలి” అని హెచ్చరించారు.
ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందండి. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయి. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్పీ తెలిపారు.(Story:జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!