బొల్లపల్లి అటవీ ప్రాంతం లో డ్రోన్ల తో గాలింపు చర్యలు
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డిఎస్పీ మరియు వినుకొండ రూరల్ సిఐ పర్యవేక్షణలో బొల్లాపల్లి మండల అటవీ ప్రాంతం మొత్తం బొల్లాపల్లి ఎస్సై సయ్యద్ సమీర్ భాష వారి సిబ్బంది సహాయంతో మూడు డ్రోన్లతో అటవీలో ఎక్కడన్నా గంజాయి సాగు చేయడం గాని పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అని గాలించినారు. అదేవిధంగా బొల్లాపల్లి మండల పరిధిలో ఎక్కడైనా సరే పేకాట, కోడిపందాలు, నాటు సారాయి, గంజాయి మొక్కలు లాంటి పెంపకం గాని తెలిసినచో ఎస్సై కి సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు సెల్ నెంబర్ : 9440796 249. (Story:బొల్లపల్లి అటవీ ప్రాంతం లో డ్రోన్ల తో గాలింపు చర్యలు)
