నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ కు విశేష స్పందన..
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ లో ఆదివారం నిర్వహించిన నవోదయ మో డల్ గ్రాండ్ టెస్ట్ కు విశేష స్పందన లబించిందని ఆ పాటశాల మానేజింగ్ డైరెక్టర్ కావూరి సాయి కుమార్, డైరెక్టర్ ఆవులమంద బ్రహ్మయ్య లు తెలిపారు. మోడల్ టెస్ట్ కు 3 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు నిర్వహించిన పరీక్ష కు రాష్ట్ర వ్యాప్తంగా 1600 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరు అయినట్లు తెలిపారు. ఈ పరీక్షలో 3 వ తరగతిలో వి. అభిజ్ఞ శ్రీ కార్తీక్, ఎం. వాసంతి, టి. లాలిత్య ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు సాదించగా, 4 వ తరగతిలో కే. భావజ్ఞ, వి. మహాలక్ష్మి, యం. జై శ్రీ వినయి లు, 5వ తరగతిలో బివి. ప్రభంజన్, జి. విక్ష, ఎస్. వర్షిత్ రాజ్ లు, 6 వ తరగతిలో సిహెచ్. వెంకట నరేంద్ర రెడ్డి, డి. రామ్ తేజ, టి. అభిక్ సాయి లు, 7వ తరగతిలో ఎ. జశ్వంత్ రెడ్డి, జే. శ్యాం జోయెల్, ఎం. హర్షిత్ రెడ్డి లు 8వ తరగతిలో సిహెచ్. స్వర్నదీప్, ఎ. హీతేంద్ర, జిఎంవి. సాకేత్ విజేతలుగా నిలిచినట్లు వెల్లడించారు. విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉచిత బోజన వసతి కల్పించటంతో పాటు విజేతలకు తమ పాటశాలలో 10 వ తరగతి వరకు ఉచిత విద్యను అందించేందుకు బాండ్ లు పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, అతిధులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story:నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ కు విశేష స్పందన..)
