సమాజ సంస్కర్త పూలే ఆశయాలు నేటికీ మార్గదర్శకాలు
“విద్యా సమానత్వం కోసం పూలే పోరాటం శాశ్వత ప్రేరణ”
“పూలే చూపిన మార్గం సామాజిక న్యాయానికి శాశ్వత దీపస్తంభం”
“వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పూలే నడిపిన ఉద్యమం అపూర్వం”
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలులు ఘటించారు. మహాత్మ జ్యోతిరావు పూలే భారత సమాజ చరిత్రలో మహానుభావుడు. వెనుకబడిన వర్గాల విద్య, హక్కుల కోసం అమూల్యమైన పోరాటం చేసిన మహోన్నత సేవా పురుషుడు”* అని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి, అణగారిన వర్గాలకు వెలుగునిచ్చేందుకు పూలే చూపిన మార్గం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం. పూలే ఆశయాలను అనుసరించడం ద్వారానే సమానతా సమాజం నిర్మాణం సాధ్యం అని తెలిపారు. పూలే విద్యను ఆయుధంగా తీసుకొని సమాజాన్ని మార్పు దిశగా నడిపారు. నేటి యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన గొప్ప జీవిత గాథను అధ్యయనం చేసి ప్రజాసేవలో ఆచరించాలని”* పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని పూలే విగ్రహానికి నివాళులర్పించారు. (Story:సమాజ సంస్కర్త పూలే ఆశయాలు నేటికీ మార్గదర్శకాలు)

