Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి

న్యూస్ తెలుగు/ వినుకొండ : స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి సారమ్మ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.లలిత లు హాజరయ్యారు. ఈ సందర్బంగా లలితమ్మ మాట్లాడుతూ. కమిషనర్ దగ్గర మాట్లాడిన అంశాలన్నింటినీ, డిసెంబర్ నెల 12వ తేదీ చలో కలెక్టరేట్ కార్యాలయాల నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయాలని వర్కర్స్ కు పిలుపునిచ్చారు. బకాయి బిల్లులు, వేతనాలు, నెల నెల సక్రమంగా చెల్లించాలని ప్రభుత్వానికి తెలిపారు. యాప్స్ అన్నిటిని సవరించాలని, కొత్త మొబైల్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నీ అందరికీ వర్తింపచేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన సరుకులు సప్లై చేయాలని రైస్, దాల్, ఆయిల్ సప్లై చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎగ్స్ మిల్క్ సకాలంలో సప్లై చేయాలని అన్నారు. ఈ సమావేశంలో టీచర్లు బి. శివ పార్వతి, ఎం. పద్మ , జి. సుజాత, ఎస్. మరియమ్మ, ఎస్.కె షర్మిల, రమాదేవి, నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఆర్. వందనం పాల్గొన్నారు.(Story:అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!