Homeవార్తలుతెలంగాణవనపర్తి జనరల్ ఆసుపత్రి కార్మికులకు న్యాయం చేయకపోతే సమ్మె తప్పదు

వనపర్తి జనరల్ ఆసుపత్రి కార్మికులకు న్యాయం చేయకపోతే సమ్మె తప్పదు

వనపర్తి జనరల్ ఆసుపత్రి కార్మికులకు న్యాయం చేయకపోతే సమ్మె తప్పదు

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ కార్మికుల అక్టోబర్ నెల జీతం కార్మికుల హాజర శాతం ప్రకారం ప్రకారం కాకుండా కొత్తగా నియమించిన విజయేంద్ర ఏజెన్సీ ఇష్టారీతిన భారీ మొత్తంలో జీతం కోతలు పెడుతూ కార్మికులకు తమ కష్టార్జితం పూర్తిస్థాయిలో అందకుండా అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. గురువారం జీవితంలో కోతలు, కార్మికులను అక్రమ తొలగింపుపై జనరల్ ఆస్పత్రి కార్మికులు నిరసన తెలిపి ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ ఎం.డి. జావేద్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ:-ఏ ఏజెన్సీ వచ్చిన కార్మికుల కష్టార్జితం దోచుకుంటున్నారే తప్ప కార్మికులకు చట్టబద్ధ జీవో 60 ప్రకారం వేతనాలు అందించడం లేదని. ఆస్పత్రి శానిటరీ, భద్రత, పేషెంట్ సంరక్షణ నిర్వహణ కోసం కొత్తగా విజయేంద్ర ఏజెన్సీని నియమించారని అన్నారు.గత నెల జీతం ఎలాంటి ప్రమాణికం చూడకుండా చెల్లించారని దీని ఫలితంగా కార్మికుల హాజరు శాతానికి వచ్చిన జీతానికి భారీ వ్యత్యాసం ఉన్నదని అన్నారు. ఇప్పటికీ దాదాపు 25 మందికిపైగా ఒక్క రూపాయి కూడా వేతనం చెల్లించలేదని వాపోయారు. కార్మికులు జీతం వచ్చిందని సంబరపడాలో తక్కువ జీతం వచ్చిందని బాధపడాలో తెలియని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక ఏళ్ళుగా పని చేస్తున్న కార్మికులను ఎలాంటి తప్పిదాలు లేకపోయినా అక్రమంగా తొలగిస్తూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కనుక తక్షణమే కార్మికుల జీవితంలో కోతలు పెట్టిన డబ్బులు ఏరియర్స్ తో చెల్లించాలని, జీతం అందని కార్మికులకు తక్షణమే చెల్లించాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను బేషరత్తుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో నిరవధిక మెరుపు సమ్మెకు తప్పదని తెలుపుటకు చింతిస్తున్నామని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి.రమేష్, ఆస్పత్రి యూనియన్ బ్రాంచ్ నేతలు కార్మికులు గంధం శీను, నరసింహ, రాజేష్,దర్గా స్వామి,నరేందర్, కుమార్,అనిల్, వెంకటయ్య, శివ,శ్రీకాంత్,రవి,కిషోర్, ప్రవీణ్, చంద్రశేఖర్,కళావతి,ఇందిరా,భాగ్య, గోవిందమ్మ,పార్వతమ్మ,అనిత, శివమ్మ, శ్వేత తదితరులు పాల్గొన్నారు.(Story:వనపర్తి జనరల్ ఆసుపత్రి కార్మికులకు న్యాయం చేయకపోతే సమ్మె తప్పదు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!