Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కుటుంబాల పట్ల చీఫ్ విప్ జీవి హృదయపూర్వక స్పందన 

 ఎస్సీ కుటుంబాల పట్ల చీఫ్ విప్ జీవి హృదయపూర్వక స్పందన 

 ఎస్సీ కుటుంబాల పట్ల చీఫ్ విప్ జీవి హృదయపూర్వక స్పందన 

ఇంటి కూల్చివేత ఘటనపై సహాయం అందజేత

ఇల్లులు కూల్చివేతతో కన్నీరుమున్నీరైన కుటుంబాలకు జీవి అండ 

తక్షణ ఆర్థిక సహాయంతో ధైర్యం పునరుద్ధరణ

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండలం, జాలలపాలెం గ్రామంలో ఇటీవల ఇల్లు కూల్చివేతకు గురై తీవ్రంగా నష్టపోయిన ఎస్సీ కుటుంబాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వయంగా వెళ్లి పరామర్శించారు. గ్రామస్తులు పరిస్థితిని వివరించగా, బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా వీక్షించిన జీవి వారి మనోభావాలను అర్థం చేసుకుని, తక్షణమే ఆర్థిక సహాయం అందజేశారు. మీ బాధను ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది… మీకు న్యాయం జరిగేలా నేను పర్యవేక్షిస్తాను. మీరు ఎదుర్కొన్న పరిస్థితి చాలా బాధాకరం. ప్రభుత్వం ఎప్పుడూ పేదల, బలహీన వర్గాల పక్షానే ఉంటుంది. మీకు జరిగిన అన్యాయంపై తక్షణ చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, పార్టీ, ప్రజాప్రతినిధులంతా మీ వెంటే ఉంటారన్నారు. జీవి వెంటనే అధికారులకు పునరావాసం, ఆర్థిక సాయం, భద్రతా చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీవి పరామర్శ కుటుంబాల్లో ధైర్యాన్ని నింపింది. ఆయన సందర్శనతో గ్రామంలో కొంత ఊరటనకలిగింది. అంతేకాక, బాధితులకు ఇచ్చిన సహాయం తక్షణ ఉపశమనం అందించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జీవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో అధికారులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.(Story :  ఎస్సీ కుటుంబాల పట్ల చీఫ్ విప్ జీవి హృదయపూర్వక స్పందన  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!