Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రెండవ రోజు కొనసాగుతున్న కబడ్డీ ఆటల పోటీలు

రెండవ రోజు కొనసాగుతున్న కబడ్డీ ఆటల పోటీలు

రెండవ రోజు కొనసాగుతున్న కబడ్డీ ఆటల పోటీలు

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు రెండవ రోజు ఉత్కంఠ భరితంగా కబడ్డీ పోటీలు జరిగింది. బాలికల విభాగంలో కడప వర్సెస్ శ్రీకాకుళం జట్ల మధ్య జరిగిన మ్యాచులు శ్రీకాకుళం బాలికల జట్టు విజయం సాధించింది. అదేవిధంగా బాలురు విభాగంలో అనంతపురం వర్సెస్ విజయనగరం మధ్య జరిగిన పోటీల్లో అనంతపురం బాలురు జట్టు విజయం సాధించారు. ఈ పోటీలను ఫ్లడ్లైట్ వెలుతురులో మరియు ప్రేక్షకులు చూసేందుకు వీలుగా గ్యాలరీని ఏర్పాటు చేశామని నిర్వాహకులు గంగినేని రాఘవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ సెక్రెటరీ ఎన్ సురేష్ కుమార్ , డివిజనల్ సెక్రటరీ చిరంజీవి, రాధా కృష్ణ మూర్తి, చినరామయ్య జోన్ సెక్రటరీ వీరాంజనేయులు, ప్రెసిడెంట్ బాజు రాజేష్ మద్దం వెంకటేశ్వర్లు, వెంకట రత్నం, అంకారావు, వ్యాయామ ఉపాధ్యాయులు దగ్గరుండి పోటీలను నిర్వహిస్తున్నారు.(Story : రెండవ రోజు కొనసాగుతున్న కబడ్డీ ఆటల పోటీలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!