చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం
న్యూస్ తెలుగు/ చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్.కె రత్న మాణిక్యం తెలియజేశారు. తొలుత మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వాతంత్రానంతర భారత ప్రభుత్వంలో తొలి విద్యాశాఖా మంత్రిగా 11 సంవత్సరాల పాటు పనిచేసి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. భారత ప్రభుత్వం ఆజాద్ కు ఆయన మరణానంతరం 1992 లో భారతరత్న ఇచ్చి గౌరవించిందన్నారు . ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి. సాయికుమార్, డాక్టర్ కె.శకుంతల,డాక్టర్ వై. పద్మ, ఎమ్. నాగమోహన్, జి. సాయికుమార్, ఆర్.మౌనిక, ఎన్.ఆనంద్, బి.శ్రీనివాసరావు, కేఎల్.ప్రసన్నకుమారి, కె.కీర్తి, కిరణ్మయి , అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.(sTORY:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం)

