Homeవార్తలుతెలంగాణపెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకస్మిక తనికి ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య.

పెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకస్మిక తనికి ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య.

పెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకస్మిక తనికి ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య.

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేరును, వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్రఅంజయ్య ఆకస్మిక తనికి గురువారం చేయడం జరిగింది.
కళాశాలలోని అన్ని రికార్డ్స్ , అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్, విద్యార్థుల హాజరు పట్టిక రికార్డ్స్, మార్కుల రికార్డ్స్, అటెండెన్స్ రికార్డ్స్ , ఇతర రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ల్యాబ్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కళాశాల అధ్యాపకులకు ఒక్కొక్కరిని సిలబస్ వివరాలను అడుగుతూ , అన్ని వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. అన్ని రికార్డ్స్ ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. వీలైనంత త్వరగా అన్ని సబ్జెక్టుల సిలబస్ ను పూర్తి చేసి, విద్యార్థుల ఫిబ్రవరి నెల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు 90 రోజుల ప్రణాళికను, రోజువారి క్యూస్షన్స్ ను అధ్యాపకులు అమలుపరచాలని తెలిపారు. తరగతి గదిలో
విద్యార్థులతో మాట్లాడుతూ మీరు రెగ్యులర్గా గా కళాశాలకు రావాలని, మీకు ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ కలదని, ఇంటర్ కమిషనర్ గారు కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షిస్తారని, రెగ్యులర్ గా వచ్చి చదువుకొని కళాశాల రిజల్ట్ పెంచాలని , మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని విద్యార్థులకు సూచించడం జరిగింది.
ఈసారి గతంలో కంటే మొదటి సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ సంఖ్యను పెంచినందుకు కళాశాల అధ్యాపకులను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎర్ర అంజయ్య, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఓబుల్ రెడ్డి , విద్యార్థుల స్టూడెంట్ కౌన్సిలర్ సి కృష్ణయ్య, అధ్యాపకులు , హనుమంత్ రెడ్డి, జ్ఞానేశ్వర్ రెడ్డి, నవీన్ కుమార్, జాకీర్ హుస్సేన్, వెంకటలక్ష్మి, శిల్ప, విమలాదేవి కర్ణాకర్, బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story:పెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకస్మిక తనికి ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!