వినుకొండ మున్సిపల్ కమిషనర్ కు అవార్డు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఇటీవల సంభవించిన మెంత తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వినుకొండ మున్సిపాలిటీ మరియు పరిసర ప్రాంతాల యందు జనజీవనానికి ఇబ్బందులు లేకుండా ముంపుకు గురైన ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సరైన సమయంలో సహాయ సహకారాలు అందించుటలో ప్రతిభ చూపిన మునిసిపల్ కమీషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేతుల మీదుగా ప్రశంస పురస్కారం అందుకోవడం జరిగింది. (Story:వినుకొండ మున్సిపల్ కమిషనర్ కు అవార్డు)

