ప్రజావాణి ఫిర్యాదులపై పోలీసు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలి
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రతి సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో ఈ రోజు వివిధ ప్రాంతాల నుండి 04 మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కి ఫిర్యాదులు అందించారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై వనపర్తి ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు. దీనితో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా జిల్లా ఎస్పీ గారు చర్యలు తీసుకోవడంపై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజావాణిలో మొత్తం 04 ఫిర్యాదుల్లో 02 – భూతగాదాల ఫిర్యాదులు 02 – పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వున్నాయి. (Story:ప్రజావాణి ఫిర్యాదులపై పోలీసు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలి)
