కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా
న్యూస్ తెలుగు /సాలూరు: కాశి బుగ్గ తొక్కి సలాట లో మరణించిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. సోమవారం సాలూరు పట్టణంలో బోసు బొమ్మ జంక్షన్ వద్ద కాశీబుగ్గలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సాలూరు తాసిల్దార్ కార్యాలయం నుండి గొల్లవీధి జంక్షన్ వరకు నిర్వహించిన అనంతరం మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 17 నెలల పాలనలో ప్రభుత్వంలో భక్తులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. కాశి బుగ్గ లో మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియో 15 లక్షలు నుండి 25లక్షలు పెంచాలని డిమాండ్ చేశారు. సింహాచలంలో, తిరుపతిలో, కాశీబుగ్గలు మరణించిన భక్తులకు నష్టపరిహారము ఇచ్చారు కానీ ఈ మధ్యలో చాలామంది గిరిజన విద్యార్థులు మరణించిన వారికి నష్టపరిహారం ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మంత్రులు అధికారులు ప్రైవేట్ ఆలయంలో ఈ సంఘటన జరిగింది ప్రభుత్వానికి ఏటువంటి సంబంధం లేదని బాధ్యత రాహిత్యంగా. మాట్లాడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రైవేటు దేవాలయాలకు ఎందుకు భద్రత ఇవ్వాలని అంటున్నది మరి వినాయక చవితి మండపాలకు దుర్గాదేవి మండపాలకి పరిమిషన్ తీసుకోవాలన్న ప్రభుత్వం, ప్రైవేట్ ఆలయాలకు ఎందుకు భద్రత కల్పించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ రెడ్డి, కొల్లి వెంకటరమణ, కాకి రంగా ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా)
