ప్రభుత్వ స్వీపర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: మోష
న్యూస్‌తెలుగు/వనపర్తి: ప్రభుత్వ స్వీపర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష డిమాండ్ చేశారు. వనపర్తి కలెక్టర్ ఆఫీస్ వద్ద వేతనాలను వెంటనే చెల్లించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల జీతాలను చెల్లించకపోవడం దారుణం అన్నారు. వేతనాల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. స్వీపర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. స్వీపర్లను పార్ట్ టైం ఉద్యోగులుగా చెబుతూ రోజంతా పనిచేయించుకుంటున్నారని పార్ట్ టైం నిబంధన తొలగించి పూర్తి ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన స్వీపర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 60 సంవత్సరాలు పైబడిన వారికి రూ. 15 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈపీఎఫ్ ఈఎస్ఐ గ్రాటివిటీ సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు శ్రీరామ్కోశాధికారిరి భాస్కర్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ స్వీపర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రషీద్, అధ్యక్షులు గోపాల్ గౌడ్, కోశాధికారి ఖయూం, రమేష్ మన్నెమ్మ శోభ రాణి మాలిక్ శాంతన్న వెంకటయ్య వాహబ్ తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రభుత్వ స్వీపర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: మోష)

