యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని సిపిఐ డిమాండ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : తుఫాను వర్షానికి వరి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఎకరాకు రూ. 50వేల సహాయం యుద్ధ ప్రాతిపదికన అందించి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ డిమాండ్ చేశారు. పానగల్ మండలం పానగల్, కేతేపల్లి లెల్లరాల్లపల్లి, చిక్కేపల్లి, వెంగలాయిపల్లి లలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడారు. తుఫాన్ కు కోతకు వచ్చిన వరిచేలు పొలాల్లో చాపలా పడిపోయాయని నీళ్లు నిలిచి మొలకలు వస్తున్నయ్ అన్నారు. ఇంకా కోతకు దాని చేలు కూడా పడిపోయాయని నీళ్లలో తడిసి గింజ పడకుండా పోయే పరిస్థితి ఉందన్నారు. ఎకరాకు రూ.70 వేల విలువగల ధాన్యం పండేదని పెట్టుబడి రూ. 40 వేలు ఫోను 30000 లాభం వచ్చేదని పంట నీటి పాలు కావడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కనీసం 50,000 పరిహారం ఇస్తేనే కొంత ఊరట లభిస్తుందన్నారు. రోహిణి కార్తెలో నాట్లు వేసిన వరిచేలు కోస్తున్నారని గ్రామాల్లో దాన్యం పోసుకునేందుకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సాగు కానీ భూమి రైతులను అడిగి ఆ పొలాల్లో ధాన్యం పోసుకొని ఆరబెట్టుకునే వారని ఈసారి పూర్తిగా కావడంతో ధాన్యం ఆరబోసుకునేందుకు ఫలాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో శాశ్వతంగా కొనుగోలు కేంద్రాలకు స్థలాలను కేటాయించాలన్నారు. టెంట్లు, తార్పలిండ్లు, ఖాళీ సంచులు, వేయింగ్ మిషన్లు, ట్రాన్స్పోర్టేషన్ వసతులతో కేంద్రాలు తెరవాలన్నారు. గత ఏడాది వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కేంద్రాల్లో హమాలీ చార్జీలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
రబీలో కొన్న ధాన్యానికి ఇంతవరకు క్వింటాలకు రూ. 500 బోనస్ ఇవ్వలేదని ఇవ్వాలన్నారు. ఖరీఫ్ లో కొనే ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఒకేసారి చెల్లించాలన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోకుంటే రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జే రమేష్, మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, మాజీ ఉప సర్పంచ్ బాలస్వామి, మాజీ వార్డు సభ్యుడు పెంటయ్య రైతులు పాల్గొన్నారు. (Story:యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని సిపిఐ డిమాండ్)

