జూబ్లిహిల్స్ 4లక్షల ఓటర్ల తీర్పు 4కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిలబెడుతుంది
న్యూస్‌తెలుగు/వనపర్తి : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బాగంగా ఈరోజు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమాజిగూడ,విజయ టవర్స్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అవకాశం వస్తే అద్భుతాలు సృష్టిస్తారని చరిత్ర చెబుతుందని అటువంటి మహిళలను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సునీతమ్మను ఉద్దేశించి మాట్లాడడం బాధాకరం అని అన్నారు. ఒక గృహిణిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చి తన ప్రతిభతో పాలన సాగించి చూపించారని కొనియాడూరు. సోనియా గాంధీ,ప్రియాంక గార్ల నాయకత్వములో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మాగంటి.సునీత గారు పాలనకు ఎందుకు అర్హులు కారో ప్రజలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని చేసిన చేయబోయే అభివృద్ధి పనులు చెప్పి ఓట్లు అడగాలి కానీ కె.సి.ఆర్,కె.టి.ఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పబ్బం గడుకోవడం వల్ల పేదల కడుపులు నిండవని హితవు పలికారు. మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కూడా అనివార్యంగా రాజకీయలలోకి వస్తే గృహిణి ఏమి చేస్తుందని కించపరిచారని మహిళగా ఒంటరిగా పోరాడి ధీటుగా సమాధానం చెప్పమని మాగంటి. సునీతను గెలిపిస్తే మాగంటి.గోపీనాథ్ గారి స్పూర్తితో అభివృద్ధి చేస్తుందని ఆమెకు మేము,పార్టీ అండగా ఉంటామని అని అన్నారు. ఈ సందర్భంగా గౌరవ సబితమ్మ,నిరంజన్ రెడ్డి సమక్షంలో పలువురు బి.ఆర్.ఎస్ పార్టీలోకి చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.నిరంజన్ రెడ్డి అపార్ట్మెంట్ వాసులకు సునితమ్మను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమములో మాజీ ఎం.ఎల్.సి గిడుగు.రుద్రరాజు,విజయ టవర్స్ అధ్యక్ష,కార్యదర్శులతో పాటు కార్యనిర్వాకులు పాల్గొన్నారు.(Story:జూబ్లిహిల్స్ 4లక్షల ఓటర్ల తీర్పు 4కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిలబెడుతుంది)

