నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణ కేంద్రంలో పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. చిన్నా రెడ్డి మాట్లాడుతూ అపార నైపుణ్యం ,అనుభవం కలిగిన డాక్టర్ల బృందంతో పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించుకున్నాము అని అన్నారు. సామాన్యునికి అందుబాటు ధరలతో, వైద్య సేవలు అందించి పేదవారికి సేవ చేయాలని డాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖర్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందిమల్ల సందీప్, ఎంట్ల రవి, నందిమల్ల రాము, బొజ్జయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story:నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి)

