హైడ్రా బాధితులకు అండగా బిఆర్ఎస్
న్యూస్‌తెలుగు/వనపర్తి : హైడ్రా పేరుతో కార్పొరేట్ సంస్థలను బ్లాక్మెయిల్ చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేసి మిన్నకుండిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళ ఇండ్లను కూల్చి కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడానికి నిర్ధాక్షిణంగా కూల్చి పేదల బతుకులను ఆగం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రగతినగర్ నందు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎం. ఎల్. సిలు,మాజీ ఎం.ఎల్. ఎలతో కలసి సందర్శించి హైడ్రా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించారు. హైడ్రా బాధితులకు నిలువ నీడ లేకుండా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో శాసనమండలి బి ర్ స్ పార్టీ ఫ్లోర్ లీడర్ మధుసూదన చారి మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎం ఎల్ ఏ వివేకానంద గౌడ్,
ఎం ఎల్ సి శంబిపూర్ రాజు, తదితరులు పాల్గొన్నారు. (Story:హైడ్రా బాధితులకు అండగా బిఆర్ఎస్)

