Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి : సిఐ గోపాల కృష్ణ

ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి : సిఐ గోపాల కృష్ణ

ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి : సిఐ గోపాల కృష్ణ


న్యూస్ తెలుగు /చింతూరు : ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని చింతూరు గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రీయ ఎక్త దివస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా శుక్రవారం చింతూరులో 2కే రన్ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులచే మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడుతూ దేశాన్ని ఏకంగా చేసిన లోహపురుషుడని ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. సామాజిక సామరస్యం, జాతీయ భద్రత కాపాడుకోవడంలో ఆయన చేసిన పాత్రను వివరించారు. యువత ఐక్యత, సమగ్రత ప్రజాసేవ ల ప్రేరణను పటేల్ జీవితం నుండి పొందాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేశ ఐక్యత గూర్చి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఎస్సై పి రమేష్, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్. పి దివాకర్, ఏ ఎస్ ఐ దొర, పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్, ఏఎన్ఎస్ పార్టీ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story:ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి : సిఐ గోపాల కృష్ణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!