తుఫాను బాధితులకు ఆర్థికసహాయం
న్యూస్ తెలుగు/విజయనగరం : మొంథా తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేసింది. దాసన్నపేట ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాలలో 30 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించింది. వారికి గురువారం ఎమ్మార్వో కూర్మనాధరావు ,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గంటా రవి, విజయనగరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కర్రోతు నర్సింగరావు ఆధ్వర్యంలో బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా. ఎమ్మార్వో కూర్మనాధరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరాశ్రయులకు రేషన్, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని , ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయనగరం మండలం అంతా నిరంతరం పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.(Story :తుఫాను బాధితులకు ఆర్థికసహాయం )

