30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతనంగా నిర్మిస్తున్న ముప్పై పడకల ఆసుపత్రి స్థలం తో పాటు నిర్మాణ మ్యాప్ ను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. నూతన భవన నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పక్కన ఉన్న భవనాల్లోకి తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వైద్యాధికారులతో మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. డెంగ్యూ పరీక్షలు కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా, టీబీ స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్ వివరాలను హెల్త్ యాప్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, ఇతర వైద్యాధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టాలి )

