సురక్ష’ యాప్‌పై అవగాహన కార్యక్రమం లో ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల కేంద్రంలో అక్రమ, కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్’పై అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు పాల్గొన్నారు. బొల్లాపల్లి గ్రామంలో వైన్ షాప్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ. ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్‌ను వినియోగదారులు తప్పనిసరిగా ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్’లో స్కాన్ చేసి, మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు. తద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించడం, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. కల్తీ మద్యం గురించి వినిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, అధికారులు , తదితరులు పాల్గొన్నారు.(Story : సురక్ష’ యాప్‌పై అవగాహన కార్యక్రమం లో ప్రభుత్వ )

