మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : వరల్డ్ హార్ట్ డే మరియు బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండల కేంద్రంలో ఆదివారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవగాహన ర్యాలీలో పాల్గొన్న జివి, గుండె మరియు మెదడు ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం, ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య నిపుణుల బృందం ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు, మందులు అందించారు. చీఫ్ విప్ మాట్లాడుతూ. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటిని నివారించవచ్చని తెలిపారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు, వైద్య బృందం, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.(Story : మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ప్రభుత్వ )

