శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి బోడేపూడి ప్రత్యేక కృషి చేయాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియమితులైన మహానాడు మీడియా ఎండీ బోడేపూడి వెంకట సుబ్బారావు , ఇప్పటం మాజీ సర్పంచ్ శంకరశెట్టి పిచ్చయ్య, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోడేపూడి, పిచ్చయ్య ను జీవీ , జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన ప్రత్యేక అభినందనలు తెలిపి సత్కారం చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ. మన వినుకొండ ప్రాంత వాసి అయిన బోడేపూడి శ్రీశైలం బోర్డు సభ్యులుగా ఎన్నిక కావడం మనందరికీ గర్వ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు లగడపాటి వెంకట్రావు, ముండ్రు సుబ్బారావు, రాపర్ల జగ్గారావు వినుకొండ యార్డ్ ఛైర్మన్ మురళి కృష్ణ యాదవ్, నర్రా కిషోర్, బుల్లేశ్వర రెడ్డి, బొంకూరి రోశయ్య, బాలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.(Story :శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి బోడేపూడి ప్రత్యేక కృషి చేయాలి )

