Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రేషన్ దుకాణాల్లో రెవెన్యూ అధికారులు అకస్మిక తనిఖీలు

రేషన్ దుకాణాల్లో రెవెన్యూ అధికారులు అకస్మిక తనిఖీలు

రేషన్ దుకాణాల్లో రెవెన్యూ అధికారులు అకస్మిక తనిఖీలు

బియ్యం బదులు డబ్బులు ఇస్తామంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తహశీల్దార్ సురేష్ నాయక్

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణం లోని పలు రేషన్ షాపుల్లో రెవెన్యూ అధికారులు శనివారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించడం లేదని, కార్డు దారులకు బియ్యం బదులుగా డబ్బులు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదు ల నేపథ్యంలో తహశీల్దార్ సురేష్ నాయక్, డీటీ మురళీ అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ – ఫాస్ మిషన్స్ లో ఉన్న ప్రకారం నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సురేష్ నాయక్ డీలర్లతో మాట్లాడుతూ. ప్రభుత్వ నిబంధనల మేరకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, సమయ పాలన ప్రకారం రేషన్ దుకాణాలు తెరిచి కార్డు దారులకు సరుకులు పంపిణీ చేయాలని, బియ్యం బదులు డబ్బులు ఇస్తామంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(Story : రేషన్ దుకాణాల్లో రెవెన్యూ అధికారులు అకస్మిక తనిఖీలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments