Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బొల్లా ఆరోపణలను ఖండించిన ఎరువుల దుకాణాదారులు

బొల్లా ఆరోపణలను ఖండించిన ఎరువుల దుకాణాదారులు

బొల్లా ఆరోపణలను ఖండించిన ఎరువుల దుకాణాదారులు

న్యూస్ తెలుగు/వినుకొండ : ఎరువుల వ్యాపారులపై బ్రహ్మ నాయుడు చేస్తున్న నిరాధారణమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. యూరియా, డిఎపి అధిక ధరలకు విక్రయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలు ముమ్మాటికి అవాస్తవం అని ఎరువుల దుకాణాదారులు సంఘం సభ్యులు అన్నారు. స్థానికంగా వున్న సంఘం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. ఎరువులు కావాలంటే పురుగు మందులు తీసుకోవాలని వ్యాపారులు బలవంత పెడుతున్నట్టు బ్రహ్మనాయుడు చేసే విమర్శలు అబద్దాలు అన్నారు. బ్రహ్మనాయుడు స్వార్థపు రాజకీయభవిష్యత్ కోసం ఫర్టిలైజర్స్ వ్యాపారులపై బురద చల్లుతున్నారు అని తెలిపారు. ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో బ్రహ్మ నాయుడు చేసిన ఆరోపణలపై దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బ్రహ్మనాయుడు నోరు తెరిస్తే, అబద్దాలు బూతులని మా వద్దకు వచ్చే రైతులు రోజు అంటుంటారు. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అనడానికి బ్రహ్మనాయుడు మాటలే నిదర్శనం అన్నారు. ఎరువుల వ్యాపారులపై మీరు చేసిన విమర్శలు ఆరోపణలో వాస్తవాలు ఉంటే నిరూపించండి. వయస్సులో పెద్దవాళ్లు వీదుల్లో తిరిగే అపరిచితుల్లా మాట్లాడొద్దు. వాస్తవాలు మాట్లాడండి. మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఫర్టిలైజర్స్ వ్యాపారులపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే మేము చట్టపరంగా ఫిర్యాదు చేసి ప్రభుత్వాన్ని ఆశిస్తామన్నారు.(Story :బొల్లా ఆరోపణలను ఖండించిన ఎరువుల దుకాణాదారులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!