ఒకేరోజు ఆటోడ్రైవర్లకు రూ. 436కోట్లు కొత్త చరిత్ర
వినుకొండ నియోజకవర్గంలోనే 1161 మంది ఆటో డ్రైవర్లకు రూ.1.74 కోట్ల లబ్ధి
జగన్ ప్రభుత్వంలో బాదింది ఎక్కువ ఇచ్చింది తక్కువ
వినుకొండలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు ఒకేరోజు రూ.436 కోట్లు సాయం అందించడం కొత్త చరిత్ర అని వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. తమ నియోజకవర్గంలోనే 1161 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.74 కోట్లు జమ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంద న్నారు. వినుకొండలో ఆటోడ్రైవర్ల సేవలో పథకం ఉత్సాహంగా ప్రారంభమైంది. నరసరావుపేట రోడ్డులో ఎన్నెస్పీ కాల్వ కట్ట, బస్టాండ్ సెంటర్, స్తూపం సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఆటోల భారీ ర్యాలీతో ఈ కార్యక్రమానికి శ్రీకార చుట్టారు. చీఫ్‌విప్ జీవీ ఖాకీ చొక్కా ధరించి స్వయంగా ఆటో నడిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో లేకపోయినా ఉచితబస్సు ప్రయాణం వల్ల వారికి జరిగే నష్టం భర్తీకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కరి రూ.15వేలు లబ్ది చేకూరుస్తుంటే గత వైసీపీ పాలన లో కేవలం రూ.10 వేలు ఇచ్చి డీజిల్, పెట్రోల్ ధరలు అమాంతం పెంచి జేబులకు చిల్లుపెట్టారని విమర్శించారు. వేలాది రూపాయల జరిమానాలు, రోడ్ ట్యాక్సులు పెంచేసి ఆటో డ్రైవర్ల రక్తాన్ని జలగల్లా జగన్‌రెడ్డి పీల్చేశారని, ప్రశ్నిద్దామంటే తప్పుడు కేసులతో వేధించే వారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ పన్నులను రద్దు చేశారన్నారు. గుంతల రోడ్లు బాగు చేసి వారిని ప్రమాదాలు, మరమ్మతుల నుంచి కాపాడా రని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ , జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు లైసెన్స్ ఇప్పిస్తాం
ప్రభుత్వ సాయం అందుకోవడానికి డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరైన నేపథ్యంలో లేనివారికి అది వెంటనే ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు చీఫ్‌విప్ జీవీ. నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ లేనివాళ్లు 2-3 వేలమంది ఉన్నారని వారందరికీ త్వరలో లైసెన్స్ వచ్చేలా చూస్తామన్నారు. 2014-19 మధ్య 4 వేలమందికి ఇలానే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించామన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా వినుకొండ నియోజకవర్గంలో 3-4వేలమంది డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్ఎల్‌ఆర్‌కు రూ.460 డ్రైవర్లు చెల్లిస్తే మిగిలిన రూ.1260 శివశక్తి ఫౌండేషన్ చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
*కూటమి ప్రభుత్వంతో పెట్టుబడులు, ఉద్యోగాలు
సంక్షేమం, అభివృద్ధికి ఢోకా లేకుండా చూస్తున్న కూటమి పాలనలో ఆర్థికవ్యవస్థ కూడా గాడిన
పడిందన్నారు చీఫ్‌విప్ జీవీ. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో 9లక్షల మందికి ఉద్యోగాలు వస్తుండడమే అందుకు నిదర్శనమన్నారు. రికార్డు సమయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేసినందుకు ప్రజలంతా మంత్రి లోకేష్, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్‌గా అమలు చేశామని… గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల భారం మోపితే తాము వచ్చాక తగ్గి స్తున్నామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల డబుల్ గ్రోత్‌తో ఏపీ దూసుకుపోతుంద ని స్పష్టం చేశారు.(Story : ఒకేరోజు ఆటోడ్రైవర్లకు రూ. 436కోట్లు కొత్త చరిత్ర )

