Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆటో డ్రైవర్లకు కుటమీ ప్రభుత్వం ఆర్థిక సహాయం

ఆటో డ్రైవర్లకు కుటమీ ప్రభుత్వం ఆర్థిక సహాయం

ఆటో డ్రైవర్లకు కుటమీ ప్రభుత్వం ఆర్థిక సహాయం

న్యూస్ తెలుగు/సాలూరు : అక్టోబర్ 4 కుటమీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చమని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా. సాలూరులో మంత్రి సంధ్యారాణి చేతులు మీదుగా ఆటో డ్రైవర్లకు. మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద నుండి ర్యాలీగా మెయిన్ రోడ్డు మీదుగా బయలుదేరి డిగ్రీ కాలేజీలో గ్రౌండ్ సభా వేదిక వద్ద వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో సాలూరు మున్సిపాలిటీ, సాలూరు మండలం, పాచిపెంట మండలం, మక్కువ మండలం లబ్ధిదారులకు ఒక కోటి 60 లక్షల 50వేల రూపాయలు అందజేయడం జరిగిందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంతో ఆటో మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉండడంవల్ల సీఎం చంద్రబాబు మంచి ఉద్దేశంతో ఆలోచించి ఒక్కొక్కరు 15 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందని. మరియు అదే విధంగా ప్రతి కుటుంబంలో మూడు గ్యాస్ బండలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.రైతులకు అన్నదాత సుఖీభవ. విద్యార్థులకు తల్లికి వందనం మొదలుకు పథకాలను ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని చెప్పారు.అర్హులై ఉండి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందునట్లయితే తనకు తెలియజేయాలని అర్హులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, సాలూరు బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆటో డ్రైవర్లు,క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు.(Story : ఆటో డ్రైవర్లకు కుటమీ ప్రభుత్వం ఆర్థిక సహాయం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments