పంట నష్ట పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
న్యూస్ తెలుగు/ సాలూరు : అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలు నష్ట పోయిన రైతులను వెంటనే ఆదుకునే నష్టపరిహారం ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పిడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. శనివారం సాలూరు మండలంలో మామిడిపల్లి, కందుల పదం, తోనాం గ్రామాల్లో పర్యటించి ఈదురు గాలులకు వర్షానికి నష్టపోయిన వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకొని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సమయానికి ఎరువులు అందక పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని తెలిపారు.అకాల వర్షం అన్నదాతను కోలుకోకుండా దెబ్బతీసిందని, మానవతా దుఃఖంతో ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పురుగులు మందులు ధరలు పెరిగి, ఎరువులు సమయానికి అందక పంట సాగు చేసిన తమకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, మామిడిపల్లి సర్పంచుల ప్రతినిధి సువ్వడ రామకృష్ణ, మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు సువ్వడ శ్రీను, తానాం సర్పంచ్ మువ్వల అదియ్య స్థానిక ప్రజా ప్రతినిధులు,వైసిపి నాయకులు,కార్యకర్తలు,మరియు తదితరులు పాల్గొన్నారు.(Story : పంట నష్ట పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి )

