Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అమృత మంజరి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి..

అమృత మంజరి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి..

అమృత మంజరి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి

న్యూస్ తెలుగు/వినుకొండ  : మను జ్యోతి ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఆదివారం నరసరావుపేట రోడ్డులోని కే.జి.ఎల్ కళ్యాణ మండపం లో జరగబోవు అమృత మంజరి (అంకురం -2) ఆధ్యాత్మిక గ్రంధావిష్కరణను జయప్రదం చేయమని కోరుతూ. స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మొదటిసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆత్మీయ గ్రంధావిష్కరణ సమావేశంకు అనేకమంది ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, సాహితీవేత్తలు, ముఖ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇంకా అనేకమంది పాల్గొననున్నారని, ఆదివారం సాయంత్రం 04 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు , జి డి సి సి బ్యాంక్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు.(Story : అమృత మంజరి ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయండి.. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!