వైసీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణం లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు సత్యం, శాంతి, అహింసలే ఆయుధాలుగా చరిత్రపై చెరగని సంతకం చేసిన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి మెంబర్ , వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ. ప్రేమ గా కౌగిలింతలు… కడుపులో కత్తులు అంటూ ఎమ్మెల్యే జీవీ, జీడీసీసీ ఛైర్మన్ మక్కెన ను బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. చేపల చెరువులను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని చేపల చెరువులు ఎవరి ఒక్కరి సోత్తు కాదు… అవి ప్రజల ఆస్తి, వాటి పై హక్కు ప్రజలకు ఉంటుంది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మరియు మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పై బొల్లా తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని చేపల చెరువులను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకుంటున్న మక్కెన, చేపల చెరువుల పేరుతో సొసైటీ బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటున్నారు. గోడ మీద పిల్లిలా ఉంటూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ లో చేరి తన అక్రమ చేపల చెరువులను వ్యాపారాలగా విస్తరించుకుంటున్నాడు. గ్రామాల్లో ఊరి చెరువులు గ్రామ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి కానీ గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోకుండా తన మేనమామ పేరుతో అక్రమంగా దోచుకోవడం జరుగుతుంది అని బ్రహ్మనాయుడు విమర్శించారు. జీడీసీసీబి ఛైర్మన్ మక్కెన కు, వినుకొండ నియోజకవర్గంలో వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి.వినుకొండ మండలం గోకనకొండ, ఉమ్మడివరం లో గ్రానైట్ వ్యాపారులను అక్రమ వ్యాపారం చేస్తున్నారని వారిని భయపెట్టి, ఆ వ్యాపారాల నుంచి ముడుపులు అందుకున్నారు, అని ప్రశ్నించారు. జీడీసీసీ బ్యాక్ తరపున ఇచ్చే లోనులో రైతుల నుంచి కమిషన్లు తీసుకుంటున్న మాట వాస్తము కాదా.?, ఈ రాష్ట్ర లో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా రైతులు పూర్తిగా నష్టపోవాల్సిందే. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము. కూటమి ప్రభుత్వంలో పత్రిక స్వేచ్ఛను హరిస్తున్నారు. మహాత్మా గాంధీ బతికి ఉంటే కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి బాధపడేవారు అని బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.(Story : వైసీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు )

