గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలపై తనిఖీ..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పట్టణంలో మాంసం విక్రయ దుకాణాలు, రెస్టారెంట్ల పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన, మాంసం దుకాణాలను గుర్తించి నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. సంబంధిత దుకాణ యజమానులపై జరిమానాలు విధించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత, ప్రభుత్వ ఆదేశాల అమలు దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని శానిటరీ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ మేస్త్రిలు, పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. (Story:గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలపై తనిఖీ..)

