Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సత్యం, అహింస శక్తిని చాటి చెప్పిన ధన్యజీవి బాపూజీ

సత్యం, అహింస శక్తిని చాటి చెప్పిన ధన్యజీవి బాపూజీ

సత్యం, అహింస శక్తిని చాటి చెప్పిన

ధన్యజీవి బాపూజీ

మహాత్ముడి ఆశయ సాధనే కూటమి ప్రభుత్వం లక్ష్యం

గాంధీ జయంతి సందర్భంగా చీఫ్ విప్ జీవీ, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన నివాళులు

న్యూస్ తెలుగు /వినుకొండ : సత్యం, అహింసా సిద్ధాంతంతోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశా నికి స్వాతంత్ర్యం తేవడంతో ద్వారా వాటి శక్తి ప్రపంచానికి చాటిచెప్పిన ధన్యజీవీ మహాత్మా గాంధీజీ అని వినుకొండ ఎమ్మె ల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. ఆయన పాటించిన అహింసా సిద్ధాంతం, ఈ ప్రాంతం, దేశానికి ఈ రోజు ఎంతో అవసరం అని పిలుపుని చ్చారు. నిజాయతీ, సమానత్వానికి నిలువెత్తు అద్ధంగా నిలిచిన బాపూజీ పేదరికం పోవాలని, గ్రామస్వరాజ్యం రావాలని కలలు కన్నారని రాష్ట్రంలో , కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు అదే లక్ష్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వినుకొండ పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట రోడ్డులోని గాంధీ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు గాంధీజీ జీవితం తరతరాలకు ఆదర్శం, అదే ప్రజలకు ఆయన ఇచ్చిన గొప్ప సందేశమన్నా రు. గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్న గాంధీజీ ఆశయాల్ని ఎన్డీయే ప్రభుత్వం సాధిస్తోంద ని, సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల పూర్తి, గ్రామాల అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించారన్నారు. ఆ యన అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఉపముఖ్యమంత్రి గ్రామస్వరాజ్యం కోసం పల్లెపండుగ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చుతున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంధ్రలను ప్రధాని మోదీ, సీఎం చంద్ర బాబు ముందుకు తీసుకుని వెళ్తున్నారని ఆరోగ్యాంధ్ర సాధనకు అదే నాందిగా పేర్కొన్నారు. అదే సమయంలో ఏటా లక్షలాది మొక్కలు నాటుతు పచ్చదనాన్ని పెంపొందించాలని కృషి చేస్తున్నామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మంత్రి లోకేష్ గ్రామాల అభివృద్ధికి విస్తృత సేవలు అందిస్తున్నారన్న జీవీ.. నేటి యువత గాంధీ జీ సిద్ధాంతాల్ని అర్థం చేసుకుని ముందుకు వెళితే ఎన్నో విజయాలు సాధిస్తారన్నారు. హింస ఎక్కడ జరిగినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోందన్న ఆయన ఆ కారణంగానే ప్రజాస్వా మ్య విలువల పరిరక్షణలో ముందు వరసలో ఉన్నామన్నారు. ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు వైకాపా ప్రభుత్వంలో చూశామని, ఇప్పుడవన్నీ మార్చుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీకీ ఘన నివాళులర్పించారు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:సత్యం, అహింస శక్తిని చాటి చెప్పిన ధన్యజీవి బాపూజీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!