పురుగుమందుల షాపులపై తనిఖీలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పరిధిలోని ఎరువులు , పురుగుమందుల షాపులను, ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలను వినుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి జీ.వరలక్ష్మి, బొల్లాపల్లి మండల వ్యవసాయ అధికారి ఏ అంకారావు, ఈపూరు మండల వ్యవసాయాధికారి రామారావు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎరువులు మరియు పురుగుమందుల డీలర్లు ఎవరైనా అనాథరైజ్డ్ గా మరియు సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్ లేకుండా పురుగుమందులు విక్రయించరాద ని పి.సీలలొ వేరే జిల్లాలకు విక్రయించడానికి పర్మిషన్ ఉన్న డీలర్లు మాత్రమే వేరే జిల్లాలకు పురుగుమందులను విక్రయించవచ్చని, డీలర్లు అందరూ స్టాక్ బోర్డు, ప్రైస్ బోర్డు, లైసెన్సును కనిపించే విధంగా డిస్ప్లే చేయాలని, ఎరువులు మరియు పురుగు మందుల రిజిస్టర్లు రోజువారి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, లేని ఎడల చట్టపరంగా చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. (Story:పురుగుమందుల షాపులపై తనిఖీలు)
