పాఠశాలకు ప్రధాన ముఖ ద్వారం గేట్ ఏర్పాటుచేసిన ముత్తినేని…
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పి కాలనీ, జెడ్పి హై స్కూల్ ముఖద్వారం గేట్ ను దాత ముత్తినేని యశోధరావు సహకారంతో నిర్మించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. వినుకొండ మండలం, నీలగంగవరం వాస్తవ్యులు ముత్తినేని యశోధరావు వారి తల్లిదండ్రులు ముత్తినేని నాసరయ్య, వెంకటమ్మల జ్ఞాపకార్ధం 80,000/ రూపాయలు తో పాఠశాలకు ముఖద్వారాన్ని ఏర్పాటుచేశారు. పాఠశాలలో 420 మంది విద్యార్ధులు, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 400 మంది బాలికలు వసతి పొందుతున్నారు. ప్రధాన గేటు ఏర్పాటు చేసినందుకు వార్డెన్ రేణుకమ్మ దాతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరప్పయ్య మాట్లాడుతూ. కొత్తగా ఏర్పాటు అయిన పాఠశాలకు మౌళిక సదుపాయాలు అవసరం ఉందని, ప్రధాన గేటు ఏర్పాటు చేసిన దాతకు మరియు గేటు ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకున్న పాఠశాల పిడీ రాధాకృష్ణ మూర్తి లను అభినందించారు. దాత ముత్తినేని యశోద రావు మాట్లాడుతూ. బయట వ్యక్తులతో ప్రతిరోజూ సమస్యలు వస్తున్నాయని పీడీ రాధా కృష్ణ మూర్తి తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే విద్యార్ధులకు మేలు చెయ్యాలనే ఉద్దేశంతో మరియు ప్రభుత్వ చీఫ్ విప్, మరియు వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు ప్రజలకు చేస్తున్న సేవాకార్యక్రమాల స్పూర్తి తో తన తల్లిదండ్రులు జ్ఞాపకార్ధం ప్రధాన గేటును ఏర్పాటు చేయడం సంతోషం గా ఉందని తెలిపారు. దసరా సెలవులు తరువాత గేటు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని పాఠశాల పీడీ రాధాకృష్ణ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఎన్. పద్మజ, ఎలీషా, ఎలిజబెత్ రాణి, గోవిందు నాయక్, రాంబాబు, చంద్రశేఖర్, శాంతి, రామాంజనేయులు, మల్లయ్య , గాయిత్రి, కోటిరత్నం,సంధ్య, వార్డెన్ రేణుకమ్మ, సి ఆర్ పి విశ్వనాథమ్ లు పాల్గొన్నారు. (Story:పాఠశాలకు ప్రధాన ముఖ ద్వారం గేట్ ఏర్పాటుచేసిన ముత్తినేని…)

