గీతాంజలి స్కూల్ లో దసరా వేడుకలు..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు దసరా వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి తేళ్ళ కృష్ణవేణి మాట్లాడుతూ. దసరా పండుగ చెడు పై మంచి సాధించిన విజయం గా ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవడం జరుగుతుంది అని, కావున చిన్నారులు అందరూ చెడుకు దూరంగా వుంటూ మంచిని అలవర్చుకొని విద్యలో రాణిస్తూ, తల్లి దండ్రులు గర్వించే స్థాయికి రావాలి అని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో చూపరులను విశేషంగా అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వై లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story:గీతాంజలి స్కూల్ లో దసరా వేడుకలు..)

