జీవి ని విమర్శించే స్థాయి బొల్లాకు లేదు… నాగ శ్రీను
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులుపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ తీవ్రంగా ఖండించారు. గురువారం జరిగిన ఒక విలేకరుల సమావేశంలో నాగ శ్రీను మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జనసేన కార్యకర్తలపై పెత్తనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతికి దూరంగా, మంచి పేరున్న నాయకులలో జీవీ ఆంజనేయులు ఒకరని ఆయన అన్నారు. బయో ఉత్పత్తుల అమ్మకాల విషయంలో బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, బయో ఉత్పత్తులను బలవంతంగా అమ్మమని ఎవరూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.(Story : జీవి ని విమర్శించే స్థాయి బొల్లాకు లేదు… నాగ శ్రీను)

