స్మార్తరత్న బిరుదు తో అవార్డు పొందిన వలబోజుల రాకేష్
న్యూస్ తెలుగు ( చింతూరు) : అంతర్జాతీయ హిందూ దేవాలయాలు & ఆధ్యాత్మిక జ్యోతిష్కుల సంక్షేమ ట్రస్ట్ – విల్లుపురం, తమిళనాడు వారు భారతదేశం 6వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక జ్యోతిష సదస్సు ను వరంగల్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వేదంపండితులు అందరూ పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి చింతూరు గ్రామానికి చెందిన వలబోజుల రాకేష్ కు ఈ అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ హిందూ దేవాలయాలు & ఆధ్యాత్మిక జ్యోతిష్కుల సంక్షేమ ట్రస్ట్ ఐకానిక్ అవార్డు తెలంగాణ 2025 వారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చింతూరు వాస్తవ్యులు అయిన వలబోజు రాకేష్ శర్మకు అత్తలూరి బాల శంకర శాస్త్రి, డోనోజు పరిపూర్ణ చార్యలు, డాక్టర్ విశ్వనాధ్గారి చేతులమీదుగా “స్మార్తరత్న ”అనే బిరుదు తో అవార్డు దక్కింది.(Story : స్మార్తరత్న బిరుదు తో అవార్డు పొందిన వలబోజుల రాకేష్ )

