Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పల్నాడు జిల్లాకు కవిసామ్రాట్ గుర్రం జాషువా పేరు పెట్టడం ఎంతైనా సముచితం

పల్నాడు జిల్లాకు కవిసామ్రాట్ గుర్రం జాషువా పేరు పెట్టడం ఎంతైనా సముచితం

పల్నాడు జిల్లాకు కవిసామ్రాట్ గుర్రం జాషువా పేరు పెట్టడం ఎంతైనా సముచితం

న్యూస్ తెలుగు/వినుకొండ  : తెలుగు సాహిత్యాన్ని సామాజిక చైతన్యం వైపు నడిపించిన విశ్వకవి గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టడం ఎంతైనా సముచితమని గుర్రం జాషువా గుంటూరు, పల్నాడు జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయకుమార్ అన్నారు. వినుకొండ లోని స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. జాషువా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన కవి కాదని, దేశం గర్వించదగ్గ జాతీయ కవీశ్వరుడు జాషువా అని, దక్షిణ భారత దేశంలో సుబ్రమణ్య భారతి వలె, ఉత్తర భారత దేశంలో ఠాగూర్‌ మరియు మైథిలి శరణ్‌ గుప్తా వలె జాషువా కూడా సర్వ మానవ సమానత్వాన్ని కోరుకొని మనిషి కేంద్ర బిందువుగా చేసుకొని తన రచనలన్నింటినీ కొనసాగించి చరిత్రలో పల్నాడుకు సరికొత్త వైభవాన్ని అందించిన మహాకవి, మనకవి జాషువా అని, ఈ విషయంపై 22 చిలకలూరిపేటలో, 25 మాచర్ల, గురజాల నియోజకవర్గాలలో కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అనంతరం జాషువా జయంతిని పరిష్కరించుకొని, జాషువా పుట్టిన గడ్డ చాట్రగడ్డపాడు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేపడతామని,ఈ సందర్భంగా ఆయా స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సుదీర్ఘ అనుభవం కలిగిన గుర్రం జాషువా కళాక్షేత్ర అధ్యక్షులు, కాంస్య విగ్రహ దాత, పోరాట యోధుడు జాన్ సుందర్ , సీనియర్ అడ్వకేట్ వంకాయలపాటి రవి , సిపిఎం అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు, టిడిపి అధ్యక్షులు దాసయ్య, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ అధ్యక్షుడు తోట ఆంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, మాల మహానాడు పట్టణ అధ్యక్షులు పమిడిపల్లి ఇశ్రాయేలు , ఎమ్మార్పీఎస్ నాయకులు, జనసేన నాయకులు, పిడిఎం నాయకులు, ముస్లిం మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగూర్ భాషా , ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ ఇర్ఫాన్, షేక్ బాజీ తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. జాషువా ఏది చేసినా ఏది రాసిన ఒక్క ప్రాంతానికో ఒక మతానికో పరిమితమైన రచనలు చేయలేదని, దేశ ప్రజల బాధలే తన బాధలుగా భావించి సర్వ మానవ సౌభ్రాతృత్వం మానవత్వపు పరిమళాలు ఈ నేలపై పరిఢవిల్లాలని కోరుకున్నాడని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.(Story :పల్నాడు జిల్లాకు కవిసామ్రాట్ గుర్రం జాషువా పేరు పెట్టడం ఎంతైనా సముచితం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!